Thursday, 12 December 2019

భగవతిదేవి ఆలయంలో నయన ,విఘ్నేశ్‌శివన్‌

భగవతీదేవి అలయంలో నయనతార ,ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌
సినిమా : నటి నయనతారకు భక్తి అధికమేనని చెప్పవచ్చు. ఆ మధ్య అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌కు ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌తో కలిసి వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. ఇటీవల తిరుమలకు వెళ్లి దేవదేవుడిని దర్శించుకున్నారు. తాజాగా కన్యాకుమారిలోని ప్రసిద్ధి చెందిన భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లి అక్కడ మూక్కుత్తి అమ్మన్‌గా దర్శనం ఇచ్చే అమ్మవారు చాలా మహిమ కలిగిన దేవతగా ప్రతీతి. కాగా నటి నయనతార త్వరలో మూక్కుత్తి అమ్మన్‌ అనే భక్తి రస కథా చిత్రంలో అమ్మవారిగా నటించనున్నారు. ఈ చిత్రం ఇప్పటికే కన్నాకుమారిలో ప్రారంభమైంది. అయితే నయనతార ఆ సమయంలో విదేశాల్లో ఉండడంతో ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనలేకపోయారని చిత్ర వర్గాలు తెలిపారు. కాగా ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చిన నయనతార తన ప్రియుడితో కలిసి సోమవారం కన్యాకుమారికి వెళ్లి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భగవతి ఆలయాన్ని సందర్శించి మూక్కూత్తి అమ్మన్‌ను దర్శించుకున్నారు.
అమ్మవారి ముందు సుమారు అరగంట పాటు కూర్చుని ప్రార్థించుకున్నారు. అనంతరం గుడి చుట్టూ ప్రదర్శనం చేశారు. కాగా ఇది శబరిమలకు వెళ్లే సీజన్‌ కాబట్టి మూక్కుత్తి అమ్మన్‌ అలయం అయ్యప్ప భక్తులతో కళకళలాడుతోంది. కాగా  నయనతార అక్కడ ఉన్న అయ్యప్ప భక్తులకు నమస్కరించారు. నయనతార గుడికి వచ్చిన విషయం ఆ ప్రాంతం అంతా వ్యాపించడంతో చుట్టు పక్కల ప్రాంతాలను నుంచి ప్రజలు ఆమెను చూడడానికి పోటెత్తారు.దీంతో ఆ ప్రాంతంలో తోపులాట జరిగింది. అయితే నయనతార ఆలయానికి రానుండడంతో దేవాలయ నిర్వాహకులు పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. కొందరు మహాళా పోలీసులు నయనతారకు రక్షణగా నిలిచారు. వారి సాయంతో నయనతార క్షేమంగా అక్కడ నుంచి బయట పడ్డారు. కాగా మహిళా పోలీసులు నయనతారతో ఫొటోలు తీసుకోవడానికి ఆసక్తి చూపడంతో ఆమె వారితో సెల్ఫీలు దిగి సంతోష పరిచారు. కాగా నయనతార త్వరలో కన్యాకుమారిలో జరుగుతున్న మూక్కుత్తి అమ్మన్‌ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ కాలం అంతా నయనతార శాఖాహారిగా మారి నియమాలను పాఠించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.

రణ్‌వీర్‌ సింగ్‌కు జోడీగా ‘అర్జున్‌రెడ్డి’ భామ

ముంబై : తన తొలి సినిమా ‘అర్జున్‌రెడ్డి’తో బోల్‌‍్డ నటిగా పేరు తెచ్చుకున్న షాలినీ పాండే బాలీవుడ్‌ ఎంట్రీ ఖరారైంది. వరుస హిట్లతో జోరుమీదున్న స్టార్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా నటించే అవకాశం ఆమెకు దక్కింది. రణ్‌వీర్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ఫిల్మ్స్ షాలినీని కూడా హిందీ తెరకు పరిచయం చేయనుండటం విశేషం. ఈ విషయాన్ని యశ్‌రాజ్‌ఫిల్మ్స్ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. దివ్యాంగ్‌ థక్కర్‌ దర్శకత్వంలో తాము నిర్మిస్తున్న జయేష్‌భాయ్‌ జోర్దార్‌ సినిమాలో షాలినీని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు పేర్కొంది. కాగా విజయ్‌ దేవరకొండ- షాలినీ పాండే జంటగా తెరకెక్కిన అర్జున్‌రెడ్డి సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సంచనాలతో పాటు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ సినిమా హిందీలో కబీర్‌సింగ్‌గా రీమేక్‌ అయ్యింది.
ఇక జయేష్‌ భాయ్‌ జోర్దార్‌ సినిమా విషయానికొస్తే.. మహిళలకు, పురుషులకు సమాన హక్కులు ఉండాలని భావించే ఓ మధ్యతరగతి వ్యక్తికి పితృస్వామ్య వ్యవస్థలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనే సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి రణ్‌వీర్‌ మాట్లాడుతూ... ‘ మనస్ఫూర్తిగా నవ్వాలంటే.. అందుకోసం ఒక్కోసారి నువ్వు చాలా నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఈ సినిమాలో జయేశ్‌ భాయ్‌ హీరోలా కనిపించడు. తనొక సాధారణ వ్యక్తి. సున్నిత మనస్కుడు‌. పితృస్వామ్య వ్యవస్థ సిద్ధాంతాలు, ఆచారాలకు వ్యతిరేకంగా అందరికీ సమాన హక్కులు ఉండాలని భావిస్తుంటాడు. నటుడిగా నాకు ఈ పాత్ర ఒక సవాల్‌’ అని చెప్పుకొచ్చాడు. 

కొబ్బరికాయ కొట్టారు



మీనా, రజనీకాంత్, ఖుష్భూ
కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు రజనీకాంత్‌. శివ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో రజనీ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మీనా, ఖు

బాహుబలి కంటే భారీ చిత్రంలో ప్రభాస్‌?

‘బాహుబలి’ తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ క్రేజ్‌ ఖండాంతరాలు దాటింది. దీంతో ఈ స్టార్‌ హీరోతో సినిమాలు తీయడానికి దర్శకనిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ‘జిల్‌’ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత ప్రభాస్‌ తదుపరి మూవీ ఏంటనే దానిపై అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ వార్త ప్రభాస్‌ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. సౌతిండియన్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ప్రభాస్‌తో ఓ చిత్రానికి ప్లాన్‌ చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. శంకర్‌కు భారీ సినిమాలను తీయడంలో స్పెషలిస్టు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఇప్పటికే రోబో, 2.0 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలన శంకర్‌ తెరకెక్కించిన విషయం తెలిసిందే. 

‘సాహో’ సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్‌ మాత్రం బాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకున్నాడు. దీంతో ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌తో భారీ బడ్జెట్‌తో పాటు తన మార్క్‌ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రాన్ని తీయాలని శంకర్‌ భావిస్తున్నట్లు.. ఇప్పటికే ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్‌ను కూడా సిద్దం చేసినట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ రేంజ్‌లో ప్లాన్‌ చేస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ హై బడ్జెట్‌ మూవీని దిల్‌ రాజు నిర్మించబోతు​న్నట్లు అనధికారిక సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే శంకర్‌ డైరెక్ట్‌ చేయబోతున్న తొలి తెలుగు హీరోగా ప్రభాస్‌ నిలవనున్నాడు. గతంలో పలుమార్లు తెలుగు హీరోలతో సినిమా తీయాలని శంకర్‌ భావించినప్పటికీ ఫర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌ కుదరలేదు. 

కాగా, ఈ చిత్రాన్ని బాహుబలి కంటే భారీ రేంజ్‌లో తీయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు కూడా అనేక వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ప్రభాస్‌ ‘కేజీఎఫ్‌’ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ చెప్పిన స్టోరీ లైన్‌కు ఓకే చెప్పినట్లు.. పూర్తి స్క్రిప్ట్‌తో రావాలని సూచించారని మరో వార్త హల్‌చల్‌ చేస్తోంది. మరోవైపు కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’ చిత్రంతో బిజీగా ఉన్న శంకర్‌.. ఈ మూవీ తర్వాతనే ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట. అయితే కోలీవుడ్‌ మాత్రం కమల్‌ సినిమా తర్వాత చియాన్‌ విక్రమ్‌తో శంకర్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తారని అంటోంది. అయితే ‘భారతీయుడు 2’తర్వాత శంకర్‌ డైరెక్ట్‌ చేయబోయేది విక్రమ్‌తోనా లేక ప్రభాస్‌తోనా అని సినీ విశ్లేషకులు తెగ చర్చించుకుంటున్నారు.  

గొల్లపూడి నాకు క్లాస్‌లు తీసుకున్నారు: చిరంజీవి




గొల్లపూడి మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందన
సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల మెగాస్టార్‌ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో   తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. గొల్లపూడి మారుతిరావుతో తనకున్నది గురుశిష్య సంబంధమని ఆయన అన్నారు. 'ఆ మధ్య  తన కుమారుడు పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ ఫంక్షన్‌కి నేను వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను  ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. ఆయనకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. గురు శిష్యుల్లాంటి సంబంధం. నేను 1979లో ‘ఐలవ్‌యూ’ అనే సినిమా చేసినప్పుడు, ఆ సినిమా ప్రొడ్యూసర్ భావన్నారాయణగారు నాకు గొల్లపూడి మారుతిరావుగారిని పరిచయం చేశారు. 

అప్పటికే గొల్లపూడి మారుతిరావుగారు చాలా పెద్ద రచయిత, నాటక రచయిత, జర్నలిస్టుగా కూడా పనిచేశారు. సాహిత్య పరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికుడు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకో అని నన్ను పంపించారు. ఆ రకంగా గొల్లపూడి మారుతిరావుగారు డైలాగులు ఎలా పలకాలో క్లాస్‌లు తీసుకున్నారు. ఈ విధంగా ఆయన నాకు గురువనే చెప్పగలను. ఆ సరదా పరిచయం మాకు స్నేహంగా మారింది. ఖాళీ ఉన్నప్పుడల్లా నేను టీ.నగర్‌లో వాళ్ళింటికి వెళ్తుండేవాడిని. ఆయన నాతో ఎన్నో సాహిత్య పరమైన విషయాలు చెప్పేవారు. తన గతం గురించి,  గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే చాలా ఆసక్తికరంగా వింటుండేవాడిని.

చదవండి: సీనియర్‌ నటుడు గొల్లపూడి కన్నుమూత
నాకు కూడా సాహిత్యం పట్ల, గొప్ప రచయితల గురించి తెలుసుకునే అవకాశం ఆయన ద్వారానే కలిగింది. 1982లో కోడి రామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో క‌ృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ కథలో ఈ పాత్రని గొల్లపూడి మారుతిరావుగారు వేస్తే బాగుంటుందని అనగానే నాకు కూడా అది మంచి చాయిస్ అనిపించింది. ఒకరకమైన శాడిజం భర్త, కామెడీగా ఉండే క్యారెక్టర్. ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్బుతంగా నటించి అందరి మన్ననలు పొందారు. ఆ విధంగా నా సహ నటుడుగా ఆయన చేయడం అనేది మంచి అనుభూతి నాకు. 
ఆ తర్వాత నుంచి ‘ఆలయ శిఖరం‘ , ‘అభిలాష’, ’ఛాలెంజ్‘ లాంటి వరుసగా ఎన్నో సినిమాలు ఇద్దరం కలిసి నటించారు. మేం ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాల ా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్యవేత్త, గొప్ప నటుడు, నాటక రచయిత అయిన గొల్లపూడి మారుతిరావుగారు దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. వారి కుటుంబానికే కాదు, యావత్తు సినీ ప్రపంచానికే తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని చిరంజీవి అన్నారు.